News February 23, 2025
నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.
Similar News
News December 3, 2025
ప్రజలను కేంద్రం దగా చేస్తోంది: రాహుల్ గాంధీ

కుల గణనపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘పార్లమెంటులో కుల గణనపై నేనో ప్రశ్న అడిగా. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం విని షాకయ్యాను. సరైన ఫ్రేమ్ వర్క్ లేదు, టైమ్ బౌండ్ ప్లాన్ లేదు, పార్లమెంట్లో చర్చించలేదు, ప్రజలను సంప్రదించలేదు. కులగణనను విజయవంతంగా చేసిన రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని లేదు. క్యాస్ట్ సెన్సస్పై మోదీ ప్రభుత్వ తీరు దేశంలోని బహుజనులను దగా చేసేలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.
News December 3, 2025
జగిత్యాల: సర్పంచ్ రేసులో జవాన్..!

తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణే ప్రధాన ధ్యేయంగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఓ ఆర్మీ జవాన్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన చెవులమద్ది శ్రీనివాస్ అలియాస్ మిలిటరీ శీను ఇండియన్ ఆర్మీలో 17 ఏళ్లు సేవలందించి హవల్దార్ హోదాలో పదవీ విరమణ పొందారు. దీంతో గ్రామంలోని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచి మంగళవారం నామినేషన్ వేశారు.


