News February 23, 2025

నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్‌పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్‌కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.

Similar News

News March 21, 2025

ఆరు గ్యారంటీలకు రూ.56 వేల కోట్ల ఖర్చు: భట్టి

image

TG: BRS హయాంలో GST వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3 శాతంగా ఉందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ఆరు గ్యారంటీలకే రూ.56 వేల కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్‌ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగినవే మేం బడ్జెట్‌లో పొందుపరిచాం. పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి BRS ఏం సాధించింది?’ అని పేర్కొన్నారు.

News March 21, 2025

మాదకద్రవ్యాలు అరికట్టేందుకు సిద్ధం: సీపీ 

image

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్‌పై పోలీస్ సిబ్బంది అధికారులకు సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు. 

News March 21, 2025

VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

image

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.

error: Content is protected !!