News July 12, 2024

నరసాపురం: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నరసాపురం మండలం కొప్పర్రులో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నరసాపురం పట్టణానికి చెందిన వీర వెంకట సూర్యనారాయణ మూర్తి (62) భీమవరంలో బ్యాంక్‌ పనిమీద బైక్‌పై బయలుదేరాడు. కొప్పర్రు గ్రామానికి చేరుకోగానే వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో సూర్యనారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు రూరల్ SI గుర్రయ్య తెలిపారు.

Similar News

News November 28, 2025

భీమవరం: ‘టెట్ నుంచి మినహాయింపు ఇవ్వండి’

image

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TET) మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ (UTF) నాయకులు శుక్రవారం భీమవరంలోని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి రామభద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

News November 28, 2025

ప.గో: టీచర్‌గా మారిన కలెక్టర్ చదలవాడ

image

విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులతో మమేకమై ఆమె కొద్దిసేపు టీచర్‌గా మారారు. గడిచిపోయిన రోజు తిరిగి రాదని, ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలని హితవు పలికారు. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని ఆమె కోరారు.

News November 28, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

గణపవరం మండలం జల్లికొమ్మరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచుల రిజిస్టరు, ట్రక్ షీట్‌లను పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమ శాతాన్ని తప్పక నమోదు చేయాలని ఆదేశించారు. ‘దిత్వా’ తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.