News July 30, 2024

నరసాపురం: యువకునిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను వంచించిన ఘటనలో నిందితుడిపై పోక్సో,ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేశామని నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్సీ ధర్మారావు తెలిపారు. పోలీసుల కథనం.. పాలకొల్లుకు చెందిన బాలిక(15)కు నరసాపురానికి చెందిన నయనాల సతీశ్(28) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. సతీశ్ ఆ బాలికను మూడు సార్లు లాడ్జికి తీసుకువెళ్లి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు

Similar News

News February 28, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.

News February 27, 2026

కలెక్టరుకు చాక్‌పీస్‌ మైక్రోఆర్ట్‌ బహూకరణ

image

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.