News October 5, 2024
నరసాపురం: రాజేంద్రప్రసాద్ నాకు అన్న: మధుబాబు

తెలుగు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి బాధాకరమని నరసాపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మధుబాబు అన్నారు. శనివారం గాయత్రి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ తను అన్నలాంటి వారిని, తమ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. గతంలో రాజేంద్రప్రసాద్, గాయత్రి, నటి కీర్తి సురేష్ తో ఉన్న ఫోటోలను మీడియాతో పంచుకున్నారు. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Similar News
News October 16, 2025
తణుకు: బీజేపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రేణుక

తణుకునకు చెందిన ముళ్లపూడి రేణుక బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి నుంచి జాతీయ మీడియా ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధిగా పాలకొల్లుకు చెందిన ఉన్నమట్ల కభర్దిలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఇరువురు నాయకులను అభినందించారు.
News October 15, 2025
పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News October 15, 2025
భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్‌కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్‌కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.