News October 1, 2024
నరసాపురం: రాష్ట్రస్థాయి పోటీలకు 48 మంది ఎంపిక
నరసాపురం మండలం ఎల్బీచర్ల అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అండర్-14, 17 రగ్బీ పోటీలకు బాల, బాలికల ఎంపికలు జరిగాయి. ప.గో. జిల్లా వ్యాప్తంగా 110 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా స్కూల్స్ గేమ్స్ సెక్రటరీ పీఎస్ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు. మొత్తంగా 48 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని, వారు త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
Similar News
News October 4, 2024
ప.గో: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!
భీమవరానికి చెందిన యువతిని సత్యసాయిజిల్లాకు చెందిన వేమారెడ్డి పెళ్లి చేసుకొని మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.
News October 4, 2024
ప.గో: దసరా వేళ.. భారీగా వసూళ్లు
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు ప.గో జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెల రోజుల క్రితమే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News October 4, 2024
హైదరాబాద్ -నరసాపురం మధ్య ప్రత్యేక రైలు
నరసాపురం, హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30 వరకు ప్రతి శని, ఆదివారాల్లో రైలు నంబర్ 07631 శనివారం రాత్రి 11.15కి హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ఆదివారం రాత్రి 8గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు హైదరాబాద్ వెళుతుంది. విజయవాడ, గుంటూరు మీదుగా ఈ రైలు నడుస్తుందన్నారు.