News July 13, 2024
నరసాపురం: వశిష్ట వారధి టెండర్లు మళ్లీ వాయిదా

వశిష్ట వారధి టెండర్లు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జాతీయ రహదారుల శాఖ ఈఈ శ్రీనివాసులు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రామేశ్వరం- నరసాపురం మండలం రాజులంక వద్ద వారధి నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. భూసేకరణపై కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో టెండర్లు తెరవకుండా NH అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదే కారణంతో వాయిదా వేయడం ఇది 11వ సారి.
Similar News
News November 18, 2025
తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆకివీడు: ఆన్లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.