News July 13, 2024
నరసాపురం: వశిష్ట వారధి టెండర్లు మళ్లీ వాయిదా

వశిష్ట వారధి టెండర్లు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జాతీయ రహదారుల శాఖ ఈఈ శ్రీనివాసులు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రామేశ్వరం- నరసాపురం మండలం రాజులంక వద్ద వారధి నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. భూసేకరణపై కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో టెండర్లు తెరవకుండా NH అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదే కారణంతో వాయిదా వేయడం ఇది 11వ సారి.
Similar News
News February 9, 2025
ప.గో: త్రాగునీరు కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై ప.గో. జిల్లాలో టెన్షన్

ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.
News February 8, 2025
JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం

జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.