News February 19, 2025

నరసాపురం: వేధింపులు భరించలేక యువతి సూసైడ్

image

నరసాపురంలోని కొప్పర్రుకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఇన్‌ఛార్జ్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. పోలీసుల కథనం.. ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న యువతిని అదే ప్రాంతానికి చెందిన యు. సాలోమోను ప్రేమపేరిట అసభ్యంగా ప్రవర్తించాడు. అతనితో పాటు అతని భార్య,చెల్లి వచ్చి దుర్భాషలాడడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై తెలిపారు.

Similar News

News July 6, 2025

కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 6, 2025

పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రతి స్కూల్లోనూ తల్లులకు పాదపూజ చేయించాలని తెలిపారు.

News July 6, 2025

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.