News January 5, 2025
నరసాపురం: సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
ప.గో. జిల్లా రైల్వే ప్రయాణికులకు నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు శనివారం తీపి కబురు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 7, 9, 11, 13, 15, 17, 18 తేదీల్లో చర్లపల్లి నుంచి నరసాపురానికి అలాగే నరసాపురం నుంచి చర్లపల్లికి జనవరి 8,10,12,14,16,18,19 తేదీల్లో రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ట్రైన్ నెం.07033- 07934 రైలును పరిశీలించాలన్నారు. ఈ రైళ్లు గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయన్నారు.
Similar News
News January 23, 2025
ప.గో: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష
ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
News January 23, 2025
పెంటపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి
పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎస్సీ పేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీ పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 23, 2025
భీమవరం: కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
భీమవరంలో ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిన మైనర్ బాలిక ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలించి బాలిక పాలకొల్లు బస్టాండ్‌లో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని, అతని మాటలు నమ్మి వెళ్లిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కాగా పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు.