News October 26, 2024
నరసాపురం: సినిమా చూసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

నరసాపురం నియోజకవర్గం సర్దుగోడప గ్రామానికి చెందిన ఉల్లిశెట్టి శ్రీనివాస్ నటించిన ‘ఎంతపని చేశావ్ చంటి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా వీక్షించేందుకు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు స్థానికంగా ఉన్న థియేటరుకు వెళ్లారు. స్థానిక ప్రేక్షకులతో కలిసి సినిమాని తిలకించారు.
Similar News
News November 11, 2025
దొంగలను పట్టించిన పసుపు రంగు చెప్పులు

భీమవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లి చోరీలు చేస్తున్న నలుగురు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. 2 రాష్ట్రాల్లో వీరిపై 12 కేసులు నమోదవ్వగా సౌత్ ఈస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై చోరీ ప్రాంతాల్లోని సీసీ, ఫింగర్ ప్రింట్‌లను పరిశీలించగా..ఓ చోరుడి పసుపు రంగు చెప్పులు విభిన్నంగా కనిపించాయి. దీంతో నిఘా పెంచి నాదర్‌గుల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని నిన్న మీడియాకు వెల్లడించారు.
News November 11, 2025
కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సస్పెండ్

కాళ్ళ జడ్పీ హైస్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ డిఈఓ నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల వచ్చిన ‘కుళ్లిన గుడ్లతో భోజనమా’ అనే వార్తపై వెంటనే విచారణ జరిగిందన్నారు. పాఠశాలలో 450 మంది విద్యార్థులకు 150 మంది మాత్రమే భోజనం చేస్తున్నారని నివేదికలో తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో హెచ్ఎం ను సస్పెండ్ చేశారు.
News November 10, 2025
14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.


