News July 19, 2024
నరసాపురం MPDO కనిపిస్తే ఈ నంబరుకు కాల్ చేయండి

నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అదృశ్యమైన ఎం. వెంకటరమణారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు, గాలింపు చర్యలకు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు,15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో సమాచారాన్ని 94407 97400, 94406 27051, 94910 63910 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
Similar News
News November 5, 2025
మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన “కౌశలం” సర్వేలో భాగంగా ఈనెల 6న నిర్వహించే మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యామ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే ద్వారా 1,09,347 మందిని గుర్తించి, 535 సెంటర్లలో ఈ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తామని బుధవారం ఆమె మీడియాకు వెల్లడించారు.
News November 5, 2025
‘గర్భగుడి వద్ద చెప్పులు’ ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News November 5, 2025
నరసాపురం: నేషనల్ లాన్ టెన్నిస్ పోటీలకు ఏంజిలిన్ ఎంపిక

నరసాపురానికి చెందిన గోడి స్పార్క్ ఏంజిలిన్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈ నెల 3న శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి 14 ఏళ్ల లోపు బాలికల టెన్నిస్ విభాగంలో ఏంజిలిన్ మూడో స్థానం సాధించింది. దీంతో డిసెంబరులో హర్యానా రోహతక్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు అభినందించారు.


