News March 11, 2025

నరసారావుపేట మాజీ MLAపై కంప్లైంట్

image

నరసారావుపేట మాజీ MLA గోపిరెడ్డి, మాజీ MP విజయసాయి రెడ్డిపై మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, టీడీపీ కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారునిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. అప్పట్లో శ్రీకాకుళం వాసి నాగరాజు తన వద్ద కోడెల రూ. 15 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ MP, మాజీ MLA ఒత్తిడితోనే చేశానని ఒప్పుకున్నారు.

Similar News

News December 10, 2025

18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకే: గద్వాల కలెక్టర్

image

గద్వాల జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డ్ మ తదితర వాటిని చూయించి ఓటు వేయవచ్చని తెలిపారు.

News December 10, 2025

MBNR: అతిథి అధ్యాపక పోస్టుకు నోటిఫికేషన్

image

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.కె.పద్మావతి తెలిపారు. సంబంధించిన పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 11 నుంచి 12 వరకు అందజేయాలని తెలిపారు.

News December 10, 2025

వనపర్తి: ‘మూడు నెలల జీతాలు పెండింగ్’

image

3నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు DM&HO డా.సాయినాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జీవో 1195 ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ.19,500 చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 నుంచి 19ఆన్‌లైన్ వర్క్ బంద్ చేస్తున్నట్లు, 19లోపు వేతనాలు ఇవ్వని పక్షంలో 20 నుంచి నిరవధిక సమ్మే చేస్తామన్నారు.