News February 3, 2025
నర్మల వాసికి జాతీయ నంది అవార్డు

గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన ప్రముఖ కథ, నవల రచయిత గుండెల్లి నీలకంఠం జాతీయ నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవలు చేశారని ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News February 12, 2026
సిరిసిల్ల: కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల, వేములవాడలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రాల వద్ద 250 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నిర్వహిస్తున్నామని, 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు.
News February 12, 2026
KMR: మొదటగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లే!

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా ఓటు హక్కు కలిగి ఉండి పోలింగ్ విధుల్లోని సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. జిల్లాలో 385 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌ల వారీగా ఓట్లు లెక్కిస్తారు.
News February 12, 2026
రమణీయం.. బ్రహ్మోత్సవం

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం నీలకంఠుడు భ్రమరాంబ సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. రావణుడి భుజస్కందాలను అధిష్ఠించిన ఉత్సవ మూర్తులకు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. రావణవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.


