News March 18, 2025
నర్వలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నర్వ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు, అధికారులకు మార్చ్ 21 నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.
Similar News
News December 8, 2025
కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.
News December 8, 2025
రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్

TG: ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా తొలి విడత ఎన్నికలు ఈ నెల 11న 4,236 స్థానాల్లో జరగనున్నాయి.
News December 8, 2025
పల్నాడు: మహిళల కోసం డీజీ లక్ష్మి పథకం

పల్నాడులో మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని డిగ్రీ చదువుకున్న యువతులకు డీజీ లక్ష్మి పేరుతో ఆన్లైన్ సేవలను ప్రారంభిస్తుంది. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా నరసరావుపేటలో 77, చిలకలూరిపేటలో 65, మాచర్లలో 32, పిడుగురాళ్లలో 35, సత్తెనపల్లిలో 32, వినుకొండలో 42, గురజాలలో 13, దాచేపల్లిలో 23 కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.


