News April 10, 2025
నర్వ: నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నర్వ మండలం లంకాల గ్రామ శివారులో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీస్ అగ్రికల్చర్ ఆఫీసర్ అఖిలారెడ్డి రైడ్ చేయగా కుర్వ బస్వరాజ్ పొలంలో రెండు క్వింటాళ్ల లూజ్ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ అఖిలారెడ్డి ఫిర్యాదు మేరకు సదర్ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ కురుమయ్య తెలిపారు.
Similar News
News December 15, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్
News December 15, 2025
లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా న్యాయ సలహాలు: జడ్జి సంతోష్

లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి క్లినిక్‌లో ఒక అడ్వకేట్ తో పాటు పారా లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని వివరించారు.
News December 15, 2025
బాపట్ల కలెక్టరేట్‌కు 173 అర్జీలు

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు 173 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నమోదైన ప్రతి అర్జీని పోర్టల్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.


