News April 8, 2025
నర్వ: లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

నర్వ మండలం లంకాల గ్రామంలోని రేషన్ దుకాణంలో సోమవారం సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులు రాములమ్మ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం భోజనం చేశారు. ఈ సంధర్బంగా రాములమ్మతో మాట్లాడారు. బియ్యం ఎలా వున్నాయని, అన్న ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News April 19, 2025
రామప్ప కనుమరుగయ్యే అవకాశం ఉంది: పాండురంగారావు

సింగరేణి ఓపెన్ కాస్ట్కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే రాబోయే రోజుల్లో రామప్ప ఆలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. వెంకటాపూర్లోని ఆలయాన్ని సందర్శించి వారు మాట్లాడారు. రామప్ప దేవాలయం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగి, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం జిల్లాకే గర్వకారణమన్నారు.
News April 19, 2025
BREAKING: గద్వాలలో యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.
News April 19, 2025
HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

కూకట్పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.