News February 20, 2025
నర్వ: వేడి నీటిలో పడి 5 నెలల చిన్నారి మృతి

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడి తనుశ్రీ (5 నెలల) చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నర్వ మండల కేంద్రంలో జరిగింది. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు తనుశ్రీ అనే పాప ఉంది. తల్లి కుమార్తెను ఎత్తుకుని వేడి నీటి బకెట్కు తీసుకెళ్తోంది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు జారి బకెట్లో పడింది. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News October 31, 2025
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో: జోగి రమేశ్

నారా లోకేశ్, చంద్రబాబులను ప్రశ్నించినందుకు తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బయటపెట్టానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.
News October 31, 2025
ఇతిహాసాలు క్విజ్ – 52 సమాధానాలు

1. జనకుని భార్య పేరు ‘సునయన’.
2. మహాభారతంలో రాధేయుడు ‘కృష్ణుడు’.
3. దత్తాత్రేయుడికి ‘24’ మంది గురువులు ఉన్నారు.
4. దేవతలకు వైద్యుడు ‘ధన్వంతరి’.
5. సముద్ర మథనంలో లక్ష్మీదేవికి ముందు పుట్టిన ఆమె అక్క పేరు ‘అలక్ష్మి’. ఆమెనే ‘జ్యేష్టా దేవి’ అని కూడా అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>> 
News October 31, 2025
పెద్దపల్లి జిల్లాలో శిశు మరణాలపై సమీక్షా సమావేశం

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు జిల్లాలో 26 శిశు మరణాలు నమోదయ్యాయని ఆమె తెలిపారు. తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే పుట్టిన శిశువుల మరణాలపై 6 కేసులను సమీక్షించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు వైద్య సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.


