News February 20, 2025

నర్వ: వేడి నీటిలో పడి 5 నెలల చిన్నారి మృతి

image

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడి తనుశ్రీ (5 నెలల) చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నర్వ మండల కేంద్రంలో జరిగింది. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు తనుశ్రీ అనే పాప ఉంది. తల్లి కుమార్తెను ఎత్తుకుని వేడి నీటి బకెట్‌కు తీసుకెళ్తోంది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు జారి బకెట్‌లో పడింది. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News March 27, 2025

మెదక్: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

image

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ ఉంటుందన్నారు.

News March 27, 2025

ALERT: నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 47 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం-13, విజయనగరం-14, మన్యం-11, అనకాపల్లి-2, కాకినాడ-4, తూర్పుగోదావరి-2, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. నిన్న YSR కడప జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. కమ్మరచేడులో 40.7, నిండ్రలో 40.1 ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

News March 27, 2025

చిన్నారిపై అత్యాచార ఘటనపై హోం మంత్రి ఆగ్రహం

image

విశాఖ వన్ టౌన్ పరిధిలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మంత్రి ఆదేశించారు. నిందితుడిని గుర్తించినట్లు కమిషనర్ మంత్రికి తెలిపారు.

error: Content is protected !!