News March 4, 2025
నర్సంపేట: ఇద్దరికి జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 26వ తేదీన ఇన్స్పెక్టర్ రమణమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. చెన్నారావుపేట మండలం కోనాపురానికి చెందిన అరవింద్, నర్సంపేట పట్టణానికి చెందిన నాగరాజు పట్టుబడ్డారు. వీరిని నేడు న్యాయస్థానంలో హాజరు పర్చగా మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ తీర్పు ఇచ్చారు.
Similar News
News March 4, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తిధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.40 పెరిగింది. దీంతో రూ.6,920 జెండా పాట పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
News March 4, 2025
మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం: WGL కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉ.10 గం.లకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మహిళలు పాల్గొని పరీక్షలు చేయించుకోవాలన్నారు.
News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.