News February 26, 2025
నర్సంపేట: తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతి

తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుపురంలో చోటుచేసుకుంది. చింతకాయల రాజశేఖర్ ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ తండ్రి మల్లయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మల్లయ్య సంవత్సరికం రోజే రాజశేఖర్ పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందగా, స్థానికులు నివాళులర్పించారు.
Similar News
News February 26, 2025
వరంగల్: ముమ్మరంగా తెర వెనుక ప్రచారం..!

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బయటకు పెద్దగా కనిపించలేదు. కానీ విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ప్రధానంగా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న HNK, WGLతో పాటు NSPT, JN, MHBD, BHPL పట్టణాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సామ దాన భేద దండోపాయాలను అమలు చేస్తున్నారు.
News February 26, 2025
వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచార ఇవ్వాలని కోరారు.
News February 26, 2025
వరంగల్: HMపై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ ఆదేశం

గీసుకొండ మండలం జాన్‌పాక ప్రభుత్వ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ సత్య శారద మంగళారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ఎం ఎలిజెబత్ రాణి ప్రవర్తనపై పలు ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ పాఠశాల సందర్శించి ఆమె ప్రవర్తనపై ఆరా తీశారు. విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతో ప్రవర్తన సరిగా లేదని, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించడం లేదని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.