News March 28, 2025
నర్సంపేట: ‘దొంతి’కి మంత్రి పదవి దక్కేనా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి వస్తుందనే చర్చ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో దొంతికి కూడా మంత్రి పదవి వస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కలిసినట్లు తెలిసింది. ఇంత వరకు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి రాలేదు.
Similar News
News April 3, 2025
వరంగల్లో 18 మందికి ఫైన్.. ఒకరికి జైలు శిక్ష

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ & డ్రైవ్లో పట్టుబడిన 17 మందిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఇందులో 16 మందికి మేజిస్ట్రేట్ అబ్బోజు వేంకటేశం రూ.18,000 జరిమానా విధించారు. ఒక్కరికి జైలు శిక్ష పడగా పరకాల సబ్ జైలుకి పంపించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికీ రూ.1000 ఫైన్ విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు.
News April 2, 2025
వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .
News April 2, 2025
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.