News August 29, 2024
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి అడ్మిషన్

నర్సంపేట పట్టణంలో ఈ ఏడాది ప్రారంభమైన ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్‌ను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శుభోధ్ శర్మ తీసుకున్నారు. కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి జాయినింగ్ లెటర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గురువారం అందజేశారు. ఎంబీబీఎస్‌లో 50 సీట్లతో ఈ ఏడాది తరగతులను నిర్వహించనున్నారు. విభాగాధిపతులు పరశురాం, గిరిధర్, దామోదరి, శ్రీదేవి, కేశవ్, తదితరులున్నారు.
Similar News
News December 20, 2025
క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

క్రిస్మస్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా, వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మూడు నియోజకవర్గాలకు (వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట) ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.
News December 20, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

భద్రకాళి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పుష్య మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
News December 20, 2025
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ఎంపీ కావ్య

WGL కేయూలో అమలవుతున్న రూసా 2.0 (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని WGL ఎంపీ కడియం కావ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలో ఆమె మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రూసా కింద మంజూరైన రూ.50 కోట్లతో పరిశోధన కేంద్రాలు, వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్టులు, కె-హబ్, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుత గడువును మార్చి 31, 2027కు పెంచాలన్నారు.


