News January 24, 2025

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దికి రేషన్ కార్డు!

image

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాజీ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు కొత్త రేషన్ కార్డు జాబితాలో ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో కొత్త రేషన్ కార్డుల లిస్టులో ‘పెద్ది’ పేరును చూసిన వారు అవాక్కయ్యారు. ఆయన పేరును తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. పేదలకు రావాల్సిన రేషన్ కార్డుల జాబితాలో పెద్ది పేరు ఉండటంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Similar News

News February 8, 2025

సిరిసిల్ల: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌‌‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.

News February 8, 2025

బాలుడి మర్మాంగాన్ని కొరికిన కుక్క..!

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుంట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తుండగా వారు పెంచుకునే కుక్క మర్మాంగాన్ని కొరికింది. కుటుంబీకులు బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడి మర్మాంగానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామకృష్ణ తెలిపారు.

News February 8, 2025

సిరిసిల్ల: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌‌‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.

error: Content is protected !!