News March 25, 2025

నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.

Similar News

News September 18, 2025

చింతపల్లి: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ వార్డు మెంబర్, శివాలయం అర్చకుడు వాడకాని రాజ్‌కుమార్ (35) నర్సీపట్నం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఘాట్ 2వ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.

News September 18, 2025

మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

image

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

News September 18, 2025

జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

image

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.