News August 3, 2024
నర్సంపేట: 256 కిలోల గంజాయి పట్టివేత

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి 256 కిలోల గంజాయిని 128 ప్యాకెట్లలో నింపి కారులో తరలిస్తుండగా నర్సంపేటలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.64 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాబు, కుమారస్వామి, ఎన్.కుమారస్వామిలను అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Similar News
News November 1, 2025
వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.
News October 30, 2025
WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.
News October 30, 2025
వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్.ఎన్. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


