News September 8, 2024
నర్సరావుపేట: సాంకేతిక సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోండి
వరద సహాయక చర్యల్లో భాగంగా సాంకేతిక సేవలు అందించేందుకు పల్నాడు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు కోరారు. మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్లల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలందించేందుకు ఏపీఎస్ ఎస్‌డిసి యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనిఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 871265 5686, 87901 17279, 87901 18349 సంప్రదించాలన్నారు.
Similar News
News October 12, 2024
గుంటూరు: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 11, 2024
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
జిల్లా ప్రజలకు కలెక్టర్ అరుణ్ బాబు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటారని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
News October 11, 2024
జగన్‌కు ఆత్మ చెప్పిందేమో: లోకేశ్
రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారని విమర్శించారు.