News November 25, 2024

నర్సాపూర్(జి)లో 11ఏళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం

image

బాలిక(11)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి యత్నించిన ఘటన నర్సాపూర్ (జి)లో ఆదివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికకు తామర పువ్వులు కోసి ఇస్తామని చెప్పి బసంత చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. ఆమె అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెల్లడించారు.

Similar News

News December 7, 2025

ADB: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

త్రైమాసిక తనిఖీలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఆయన గోదాం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, అర్బన్ తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

News December 6, 2025

ADB: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సున్నితమైన వాతావరణం నెలకొంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు ఉంటాయన్నారు.