News April 12, 2025

నర్సాపూర్(జి): జీవితంపై విరక్తి చెంది సూసైడ్: SI

image

ఉరేసుకొని వ్యక్తి మరణించిన ఘటన రాంపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట రమేశ్(28) కొన్నేళ్లుగా మద్యానికి బానిసై భార్యతో గొడవపడుతుండేవాడు. భార్య ఆరు నెలల క్రితం తల్లిగారింటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. అతడి భార్య రుక్మ ఠాణాలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు.

Similar News

News October 31, 2025

NTR: అలర్ట్.. రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో ఆగస్ట్ 2025లో నిర్వహించిన బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 31, 2025

‘మొంథా’ బీభత్సం.. విద్యుత్ శాఖకు భారీ నష్టం!

image

మొంథా తుఫాన్ ప్రభావంతో TGNPDCLకు భారీ నష్టం జరిగింది. ఈదురుగాలులు, వర్షాలతో చెట్లు కూలి విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. సంస్థ పరిధిలో 428 స్తంభాలు, 218 ట్రాన్స్‌ఫార్మర్లు, 8 సబ్‌స్టేషన్లు ప్రభావితమయ్యాయి. 172 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 342 స్తంభాలు, 205 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. హనుమకొండలో 164 స్తంభాలు, వరంగల్‌లో 86 ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్‌కు వచ్చాయి.

News October 31, 2025

ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

image

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.