News March 27, 2025

నర్సాపూర్(జి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి: SI

image

నర్సాపూర్ మండలంలోని తురాటీ గ్రామ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై సాయికిరణ్ వివరాల ప్రకారం.. తురాటీ గ్రామానికి చెందిన బొడికరి లక్ష్మి – నారాయణ దంపతులు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తూ దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందగా నారాయణకు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు.

Similar News

News November 24, 2025

అన్నమయ్య: పక్కా ఇల్లు.. 6రోజులే గడువు

image

గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. స్థలం ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. స్థలం లేనివాళ్లకు 3సెంట్లు కేటాయించి ఇల్లు మంజూరు చేస్తారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాళ్లు సైతం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు చేస్తారు.

News November 24, 2025

భీమవరం: 3,000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 24, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.