News March 27, 2025
నర్సాపూర్(జి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి: SI

నర్సాపూర్ మండలంలోని తురాటీ గ్రామ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై సాయికిరణ్ వివరాల ప్రకారం.. తురాటీ గ్రామానికి చెందిన బొడికరి లక్ష్మి – నారాయణ దంపతులు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తూ దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందగా నారాయణకు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు.
Similar News
News April 23, 2025
HYDలో మ.12 వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే!

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.68% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది.
News April 23, 2025
IPL: నల్ల బ్యాండ్లు ధరించనున్న ప్లేయర్లు

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇవాళ SRHvsMI మ్యాచులో ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించనున్నారు. అలాగే మ్యాచుకు ముందు నిమిషం పాటు మౌనం పాటిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. చీర్ లీడర్లు, ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్‌ను కూడా నిర్వాహకులు రద్దు చేశారని పేర్కొన్నాయి. ఇవాళ HYD ఉప్పల్ స్టేడియంలో రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
News April 23, 2025
రూ.2 లక్షల రుణమాఫీ చేశాం: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే

రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. MBNR జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేశామని, గిట్టుబాటు ధర కల్పించి రైతుకు అండగా నిలిచామని, వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు.