News April 12, 2025

నర్సాపూర్: కన్న తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల దశరథంపై సొంత కుమారుడు వడ్ల నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దశరథ్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దశరథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూమి పంచి ఇవ్వడం లేదంటూ తండ్రిపై నాగరాజు దాడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Similar News

News October 21, 2025

మెదక్: 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

image

పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరక అజయ్ కుమార్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
అరక జ్యోతి, సంజీవరావు కుమారుడు అజయ్ కుమార్ 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శిగా విధుల్లో చేరాడు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, 2023లో ఎస్ఐ, గ్రూప్-2లో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు.

News October 20, 2025

మెదక్: అగ్నిమాపక కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

మెదక్ జిల్లా రామాయంపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అగ్నిమాపక సేవలపై హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని పరికరాల పనితీరు, వాహనాల వినియోగం, హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సిబ్బంది వెంటనే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 19, 2025

మెదక్: పాతూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ మండలం పాతూరు సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.