News November 6, 2024

నర్సాపూర్‌: కాల్వలో బైక్ బోల్తా.. ఇద్దరి మృతి

image

బైక్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలా శివారులోని రాయరావు చెరువు కట్ట కాల్వలో బైక్ బోల్తా పడి మంగళవారం రాత్రి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన రాములు, వ్యాపారి నరసింహులుగా గుర్తించారు.

Similar News

News December 9, 2025

మెదక్: గ్రామాల్లో.. వాట్సప్ ప్రచారాలు

image

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.

News December 8, 2025

MDK: బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల తనిఖీపై అబ్జర్వర్ కీలక సూచనలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు విధులలో నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ సూచించారు. ఐడీఓసీ సమావేశ హాల్లో శిక్షణా కార్యక్రమంలో 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించడం, సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు, బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల పరిశీలన, రిపోర్ట్ సమర్పణలపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.

News December 8, 2025

మెదక్: చెక్‌పోస్టును సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్‌పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.