News March 9, 2025
నర్సాపూర్ (జి): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

గొల్లమడ గ్రామ శివారులోని నీరటి బుద్దేశ్వర్ వ్యవసాయ భూమికి దగ్గరలోని అడవిలో వేప చెట్టుకు గొల్లమడ గ్రామానికి చెందిన నీరటి గంగాధర్(44) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య నీరటి సవిత నర్సాపూర్ జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎండీ జలాలుద్దీన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News October 26, 2025
ఫుడ్ పాయిజనింగ్ కావొద్దంటే ఇవి మస్ట్!

TG: రాష్ట్రంలో గత 9 నెలల్లో 34K+ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ‘బయటి ఫుడ్, ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన ఆహారం తినొద్దు. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. శుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తినే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడగాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు.
News October 26, 2025
MNCL: 27న మద్యం దుకాణాల కేటాయింపు

నూతన మద్యం పాలసీ విధానం 2025- 27లో భాగంగా మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పివిఆర్. గార్డెన్స్ లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.
News October 26, 2025
ఈ నెల 27న ఆదిలాబాద్లో జాబ్ మేళా

ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9154679103, 9963452707 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.


