News March 9, 2025
నర్సాపూర్ జి: ఉపాధ్యాయుడి అరెస్ట్

గత నెలలో పాఠశాల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గణిత ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు కాగా అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. కాగా శనివారం గణిత ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
Similar News
News March 24, 2025
SLBCలో ఆ ఏడుగురి ఆచూకీ లభించేనా..?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ SLBC సొరంగం కూలి 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న ఒకరి మృతదేహం లభించగా మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ ఘటన జరిగి నేటికి 31 రోజులు గడిచినా సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి మృతదేహాలు లభించేనా అని అనుమానం వ్యక్తమవుతోంది. అధికారులు, సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఆ ఏడుగురి ఆచూకీ మాత్రం దొరకడం లేదు.
News March 24, 2025
ADB: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News March 24, 2025
SLBC ఘటనపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పరిధి నాగర్ కర్నూల్ జిల్లా SLBC సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలించింది. కాగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.