News January 23, 2025
నర్సాపూర్ (జి): బస్సును ఢీ కొట్టిన లారీ

నిర్మల్ నుంచి భైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును నసీరాబాద్ గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న దిలావర్పూర్కు చెందిన నర్సమ్మకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిరణ్ వెల్లడించారు.
Similar News
News March 13, 2025
పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకొని ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.
News March 13, 2025
MNCL: పోలీసు అధికారులకు సీపీ కీలక సూచనలు..

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మొదటగా అందుబాటులో ఉండడంలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో జరిగే ప్రతి విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన, సమాచారం ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
News March 13, 2025
పీ 4 సర్వేతో ప్రతీ గృహానికి లబ్ధి చేకూరుతుంది: కలెక్టర్

ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బుధవారం విజయవాడ కలెక్టరేట్ ఛాంబర్లో ప్రణాళిక శాఖ రూపొందించిన అవగాహన, క్యూఆర్ కోడ్తో కూడిన పోస్టర్నును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 దిశగా ముందుకు వెళుతుందన్నారు.