News February 1, 2025
నర్సాపూర్ (జి): మద్యం మత్తులో ఉరేసుకున్నాడు..!

నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన కోడె ప్రభాకర్(40) భార్య 4 ఏళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు.
Similar News
News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ప్రత్యేక పూజలు

శ్రీశైలంలో లోక కల్యాణార్థం పంచమఠాలలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం విశేష పూజలు, అభిషేకం, పుష్పార్చనలు చేశారు. ముందుగా ఘంటా మఠంలో, ఆ తర్వాత బీమశంఖ రమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజా కార్యక్రమాలను జరిపించారు. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి.


