News February 24, 2025
నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నర్సాపూర్ (జి)గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. భైంసా పట్టణానికి చెందిన సంతోష్, గౌతమ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై నిర్మల్‌లో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా నర్సాపూర్ గ్రామ శివారులో బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోష్, గౌతమ్‌కు తీవ్ర గాయాలు కాగా ఆదివారం సంతోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిరణ్ తెలిపారు.
Similar News
News March 26, 2025
జొమాటో, స్విగ్గీ షేర్ల పతనం.. కారణమిదే!

జొమాటో, స్విగ్గీ షేర్లు ఈరోజు తడబడ్డాయి. జొమాటో 5శాతం, స్విగ్గీ 1.88శాతం మేర తగ్గాయి. BoFA బ్రోకరేజీ సంస్థ వాటి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడమే దీనిక్కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. జొమాటోను ‘కొనుగోలు’ నుంచి ‘న్యూట్రల్’కు, స్విగ్గీని ‘కొనుగోలు’ నుంచి ‘తక్కువ ప్రదర్శన’ స్థాయికి BoFA తగ్గించింది. ఫుడ్ డెలివరీ రంగాల్లో నష్టాల ఆధారంగా డౌన్‌గ్రేడ్ చేసినట్లు ఆ సంస్థ వివరించింది.
News March 26, 2025
ఆ ప్రకటనలకు స్పందించకండి: విజయవాడ సీపీ

ట్రేడింగ్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తోందని సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటనలు చూసి స్పందించ వద్దని విజయవాడ సీపీ రాజశేర్ బాబు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఈ తరహా మోసాలు జరుగుతున్నందున ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా http://CYBERCRIME.GOV.IN అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని సీపీ చెప్పారు.
News March 26, 2025
పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.