News March 23, 2024
నర్సాపూర్: డమ్మీ తుపాకీతో బెదిరించిన మేకల దొంగలు

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి శివారులో మేకలను దొంగలించేందుకు ప్రయత్నించిన భీమ్ రావు, మధు అనే ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. డమ్మీ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన ఇద్దరు యువకులు బైక్‌పై నుంచి కింద పడటంతో గాయాలయ్యాయి. దొంగలను ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News January 3, 2026
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పరేడ్

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఈరోజు పరేడ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించి పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం అవసరమని సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
News January 2, 2026
నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
News January 2, 2026
మెదక్: ‘విద్యావంతులే బలవుతున్నారు’

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు బలవుతున్నారని, అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. APK ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.


