News September 21, 2024

నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?

image

నర్సాపూర్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

MDK: ఎన్నికల అధికారి కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

image

నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు ఆటోను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ఓ మహిళకు తాకింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన ఇన్నోవా కారు నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్‌దిగా తెలుస్తుంది.

News December 9, 2025

మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

image

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.

News December 9, 2025

మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.