News April 17, 2025

నర్సాపూర్: తండ్రి హత్యకు ప్రయత్నించిన కొడుకు అరెస్ట్

image

తండ్రిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన వడ్ల దశరథ్(60)పై ఆయన పెద్ద కుమారుడు నాగరాజు ఈనెల 12న ఆస్తి పంపకాలు చేయడం లేదని కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో నాగరాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News April 20, 2025

సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 20, 2025

చేగుంట: అడవి పంది ఢీకొని ఒకరి మృతి

image

చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో బైక్‌ను అడవి పంది ఢీకొట్టడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన బొంది భాను(18), తుమ్మల కనకరాజు(27) బైక్ పై రాజుపల్లి నుంచి కొండాపూర్‌కు వెళ్తున్నారు. పోలంపల్లి శివారులో అడవి పంది అడ్డు రావడంతో ఢీకొట్టి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన భాను చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.

News April 20, 2025

మానవ తప్పిదాలు, అజాగ్రత్తతోనే ప్రమాదాలు: ఎస్పీ

image

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అధిక వేగంతో వాహనం నడపొద్దన్నారు.

error: Content is protected !!