News March 7, 2025
నర్సాపూర్: మాజీ ఎమ్మెల్యే మనవడు మృతి

నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మనవడు నర్సాపూర్ శివారులోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిలుముల నారాయణరెడ్డి డెడ్ బాడీగా గుర్తించారు. మృతదేహాన్ని చిక్మద్దూర్ గ్రామానికి తరలించారు.
Similar News
News March 9, 2025
మెదక్: విషాదం.. మామ, కోడళ్లు మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఒకేరోజు మామ కోడలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మక్కరాజుపేట కు చెందిన ఆరేళ్ల సుమలత (35) వారం రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి మామ పోచయ్య (35) తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరగగా పోచయ్య గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న పోచయ్య ఈరోజు మృతిచెందగా, అస్వస్థతకు గురైన కోడలు సైతం మృతి చెందింది.
News March 9, 2025
మెదక్లో లోక్ అదాలత్.. 1500 కేసుల్లో రాజీ

మెదక్ జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ఆధ్వర్యంలో 1500 కేసుల్లో రాజీ పడ్డారు. రూ.46 లక్షల 32వేల పరిహారం ఇప్పించారు. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, మొబైల్ కోర్టు జడ్జి సాయి ప్రభాకర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
News March 9, 2025
మడూర్ విద్యార్థికి జిల్లా జడ్జి సన్మానం

మెదక్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సివిల్ జ్యుడీషియల్ జడ్జి లక్ష్మి శారద చేతుల మీదుగా చిన్నశంకరంపేట మం. మడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అంకిత సన్మానం అందుకున్నారు. వారణాసిలో జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న అంకిత ప్రతిభను గుర్తించి ఈ సన్మానం చేసినట్టు పాఠశాల HM రవీందర్ రెడ్డి, పీడీ నరేశ్ తెలిపారు.