News March 7, 2025

నర్సాపూర్: మాజీ ఎమ్మెల్యే మనవడు మృతి

image

నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మనవడు నర్సాపూర్ శివారులోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిలుముల నారాయణరెడ్డి డెడ్ బాడీగా గుర్తించారు. మృతదేహాన్ని చిక్‌మద్దూర్‌ గ్రామానికి తరలించారు.

Similar News

News January 17, 2026

మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 17, 2026

మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.

News January 17, 2026

మెదక్ మున్సిపాలిటీలు.. మహిళలకే పట్టం!

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా గర్జన వినిపించనుంది. ఛైర్‌పర్సన్ పీఠాలన్నీ మహిళలకే రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. మెదక్ స్థానం బీసీ మహిళకు దక్కగా.. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో ఆశావహుల సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు.