News December 1, 2024
నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్(24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు
Similar News
News February 7, 2025
మెదక్: పెరగనున్న జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 మున్సిపాలిటీలు, 21 మండలాలున్నాయి. మసాయిపేట కొత్త మండలం ఏర్పడడంతో జడ్పిటిసి, ఎంపిపి పదవులు పెరగనున్నాయి. ఒక ఎంపిటిసి స్థానం పెరగనుంది. ZPTC-21, MPP-21, MPTC-190, గ్రామ పంచాయతీలు 469 ఉండగా 492 కు పెరిగాయి.
News February 6, 2025
మెదక్: ఏడుపాయల ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణపై శాశ్వత పరిష్కారానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణకు శాశ్వత పరిష్కారం, మహాశివరాత్రి పర్వదినం, జాతర నిర్వహణకు శాఖల వారీగా కార్యచరణ పై చర్చించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
News February 6, 2025
మెదక్: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

ఉత్తరప్రదేశ్‌లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.