News July 5, 2024

నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు

image

MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News December 21, 2024

బాల్యం అంటేనే ఒక మధుర స్మృతి: ఎంపీ కావ్య

image

జఫర్‌గడ్ మండలం కునూరు గ్రామ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులందరూ కలిసి నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వరంగల్ కడియం కావ్య హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. బాల్యం అంటేనే ఓ మధుర స్మృతి అని, ఏ పాఠశాలకైనా విద్యార్థులే పునాది అని, మనకు చదువు నేర్పిన పాఠశాలకు మనం ఎదో ఒకటి చేయాలన్నారు.

News December 21, 2024

మున్సిపాలిటీలుగా కేసముద్రం, ఘన్‌పూర్.. మీ కామెంట్?

image

కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్ మండలాలను మున్సిపాలిటీలు‌గా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కేసముద్రం పరిధిలో 40 గ్రామ పంచాయతీలు, స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలో 18 ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీఓ విడుదల చేయాల్సి ఉంది. మరి ఎన్ని గ్రామాలు మున్సిపాలిటీలో కలుస్తాయి..? ఎన్ని గ్రామాలు GPలుగానే కొనసాగుతాయి? అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్.

News December 21, 2024

హనుమకొండ: ఎల్కతుర్తి ఎస్సై సస్పెండ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. భూ వివాదంలో, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా పోలీస్ స్టేషన్‌లో మరి కొంతమంది ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు సమాచారం.