News April 9, 2025
నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
Similar News
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.
News September 17, 2025
ములుగు: బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలపై రైతులు ఫైర్.. నిరసన ప్రదర్శనకు సన్నద్ధం!?

తన ఆస్తి మొత్తం ఇస్తా.. ములుగు కలెక్టర్‌ను వదిలిపెట్టొద్దంటూ బీఆర్ఎస్ నేత, విత్తన కంపెనీ ఏజెంట్ నర్సింహమూర్తి చేసిన వ్యాఖ్యలపై మొక్కజొన్న రైతులు ఫైర్ అవుతున్నారు. నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాల కారణంగా జిల్లాలో 671 మంది 1521 ఎకరాల్లో నష్టపోయారు. కలెక్టర్ దివాకర చొరవతో జులై 7న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క చేతుల మీదుగా రూ.3.8 కోట్లు పరిహారం ఇచ్చారు.
News September 17, 2025
ADB: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. ఈనెల 18, 19న అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బీఏలో 1, బీకాం (సీఏ)లో 3, బీఎస్సీ బీజేడ్సీలో 3, ఎంపీసీఎస్‌లో 14 , డాటా సైన్స్‌లో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9849390495 నంబర్‌కు సంప్రదించాలన్నారు.