News April 9, 2025
నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
Similar News
News April 21, 2025
దేశవ్యాప్త సమ్మెకు LPG డిస్ట్రిబ్యూటర్ల పిలుపు

తమ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించకపోతే దేశవ్యాప్త సమ్మె చేస్తామని LPG డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కేంద్రాన్ని హెచ్చరించింది. నిర్వహణ వ్యయం అధికమైనందున 14.2KG సిలిండర్‌కు ఇస్తున్న ₹73.03 కమీషన్‌ను ₹150కి పెంచాలని డిమాండ్ చేసింది. ఉజ్వల స్కీమ్‌లోని సిలిండర్ల పంపిణీలో సమస్యలున్నాయని, ఆయిల్ కంపెనీల టార్గెట్లనూ భరించలేకపోతున్నామని పేర్కొంది. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపింది.
News April 21, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా..

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో 43.7°C, కొమరాడ, పార్వతీపురం మండలాల్లో 43.4°C నమోదవుతాయని తెలిపింది. మిగిలిన అన్ని మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News April 21, 2025
జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.