News April 9, 2025
నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
Similar News
News April 25, 2025
అల్లూరి: కవల పిల్లలకు ఒకేలా మార్కులు

ముంచింగిపుట్టు మండలం మాకవరం గ్రామానికి చెందిన రామ్, లక్ష్మణ్ కవల పిల్లలు. వాళ్లిద్దరూ కలిసి పుట్టారు. కలిసి పెరిగారు. కలిసే చదివారు. ఇద్దరిదీ ఒకే రూపం, ఒకే బడి, ఒకే తరగతి, చివరికి వారికి వచ్చిన మార్కులూ కూడా ఒక్కటే. ముంచింగిపుట్టు GTWAస్కూల్ (B-1)లో 10వ తరగతి చదివి, ఇటీవల విడుదలైన ఫలితాలలో సమాన మార్కులు(349)తో పాస్ అయ్యి ఆశ్చర్య పరిచారు. ఇది కాకతాళీయమే అయినా, పేరెంట్స్, టీచర్స్ సంతోషంగా ఉందన్నారు.
News April 25, 2025
ఆమె చదువు అమూల్యం.. అతని సాయం చిరస్మరణీయం

AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్‌లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్‌బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News April 25, 2025
పిట్లం: తర్బూజా సాగు.. లాభం బహు బాగు..!

బతుకు దెరువు కోసం 10 ఏళ్లు దుబాయ్ వెళ్లిన వ్యక్తి సొంత గడ్డపై వ్యవసాయం చేస్తూ లాభాల పంట పండిస్తున్నాడు. పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన సలీం ఖాన్ పిట్లంలో ఆరు ఎకరాల భూమిని ఏడాదికి రూ. 1.20 లక్షలకు కౌలుకు తీసుకుని తర్బూజా సాగు చేపట్టాడు. ఇందుకు రూ. 4.50 లక్షల పెట్టు బడి పెట్టాడు. ప్రస్తుతం పంట బాగా రావడంతో ఏకంగా రూ. 9 లక్షల లాభం పొందాడని సలీమ్ Way2 Newsతో గురువారం తెలిపాడు.