News February 8, 2025

నర్సీపట్నంలో అల్లూరికి చెందిన ఫారెస్ట్ ఉద్యోగి మృతి

image

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడి పుట్టన్న అనే ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. నర్సీపట్నం కూడలిలో బైక్‌పై వెళ్తుండగా హ్యాండీల్ అటుగా వెళ్తున్న బస్సుకు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై టౌన్ సీఐ గోవిందరావు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ మర్రిపాకల రేంజ్‌లోని పలకజీడి సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు.

Similar News

News October 24, 2025

స్వాతి కార్తె అంటే ఏంటి?

image

27 నక్షత్రాల ఆధారంగా రైతులు ఏర్పరచుకున్న కార్తెల్లో ఇదొకటి. సూర్యుడు స్వాతి నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయాన్ని ఈ కార్తె సూచిస్తుంది. ఇది OCT 24 నుంచి NOV 6 వరకు ఉంటుంది. ఈ కార్తెలో పడే వర్షాలను ‘స్వాతి వానలు’ అంటారు. ఈ వర్షాలు వరికి ప్రతికూలం. మెట్ట పంటలకు అనుకూలం. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి’ అనే సామెత ఈ వర్షాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. వరి కోతలు, రబీ జొన్న సాగు పనులు ఇప్పుడు మొదలవుతాయి.

News October 24, 2025

ఇక ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్

image

TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేలా బోర్డు ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు సెకండియర్‌కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. ఇంటర్‌లో కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెట్టనున్నారు.

News October 24, 2025

టీడీపీ కాకినాడ రూరల్‌ ఇన్‌ఛార్జిగా నులుకుర్తి ఖరారు?

image

కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి దాదాపు ఏడేళ్లుగా టీడీపీకి ఇన్‌ఛార్జి లేరు. ఇన్‌ఛార్జి పదవి కోసం పలువురు పోటీపడుతున్న తరుణంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం పోటీపడిన కటకంశెట్టి బాబిని కుడా (KUDA) ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.