News February 26, 2025

నర్సీపట్నంలో అల్లూరి జిల్లా వాసి మృతి

image

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పనసల చంద్రశేఖర్‌ ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం వద్ద కాలేజీ బ్యాగ్ దొరికిందని పోలీసులు తెలిపారు. అందులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Similar News

News October 19, 2025

విజయవాడలో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ. 250, స్కిన్ చికెన్ రూ. 240కి విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మటన్ ధర కేజీ యథావిధిగా రూ. 900 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో బొచ్చ రూ. 250, రాగండి రూ. 220గా ఉన్నాయి. అదే విధంగా 30 కోడిగుడ్లు రూ. 164కి అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 19, 2025

మచిలీపట్నంలో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడాలు కనిపించాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ. 200, స్కిన్‌లెస్ రూ. 220కి అమ్ముతున్నారు. గ్రామాల్లో స్కిన్ చికెన్ కేజీ రూ. 220, స్కిన్‌లెస్ రూ. 240కి విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం పట్టణంలో కిలో రూ. 1000గా ఉంటే, గ్రామాల్లో రూ. 800కి విక్రయాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News October 19, 2025

MHBD: పెళ్లికి నిరాకరణ.. ప్రియుడి ఆత్మహత్య

image

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. SI కరుణాకర్ తెలిపిన వివరాలు.. ఇనుగుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు(27) వరంగల్‌కు చెందిన ఓ అమ్మాయి 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రాజు ఈ నెల 15న పురుగుమందు తాగాడు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.